Dec 27, 2011

దక్షిణ

పూర్వము గోలోకము లో సుశీల అనే గోపిక ఉన్నది.ఆమె  శ్రీహరి కి అత్యంత ప్రియురాలు.రాధ కు స్నేహితురాలు.విద్యా గుణవతి అయిన యువతి.ఒకనాడు ఆ సుశీల రాధ చూచుచుండగా  శ్రీకృష్ణుని ఎడమ భాగమున నిలుచుండెను.అప్పుడు గోపికలందరిలో అందెవేసిన చేయి అయిన రాధ తన ఎదురుగ ఉండుట చూసి శ్రీకృష్ణుడు భయముతో తల వంచుకొనెను.రాధ ఆ దృశ్యము చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది..అది చూసి శ్రీ కృష్ణుడు అంతర్ధానం అయ్యాడు.శ్రీకృష్ణుడు అంతర్ధానం అవటం చూసి సుశీల,మిగత గోపికలు భయపడిపోయారు.వారందరూ కృష్ణున్ని ప్రార్ధించారు..సుశీల పారిపోయింది,,సుశీల పారిపోవుట,శ్రీకృష్ణుడు కనిపించక పోవుట తెలుసుకొని రాధ సుశీల ను శపించింది,,ఇక నుండి గోలోకము లో కాలు పెట్టరాదు,పెట్టిన భస్మము అవుదువు గాక అని.రాధ శ్రీ కృష్ణుని దర్శనము ఇమ్మని ప్రార్ధించింది,,కాని శ్రీకృష్ణుడు రాధ ముందు కనిపించలేదు.
చాలా సంవత్సరాలు సుశీల తపస్సు చేసి లక్ష్మి దేవి శరీరము లో ప్రవేశించినది.
తరువాత దేవతల అందరూ అనేక యజ్ఞములు చేసారు.కనీ వారు ఆ యజ్ఞముల ఫలమును అనుభవింప లేకుండిరి.అప్పుడు వారు అందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్లి మొర పెట్టుకున్నారు.బ్రహ్మ కొంత కాలము తన మనస్సులో విష్ణు మూర్తి ని ధ్యానించి సమాధానము పొందారు.దాని ఫలితము గా నారాయణుడు మహాలక్ష్మి శరీరము నుండి ఒక దేవి పుట్టించి ఆమెను బ్రహ్మ కు సమర్పించారు.ఆ దేవి లక్ష్మి కు దక్షిణ భాగము నుండి జనించుట చే ఆమెకు దక్షిణ అనే పేరు వచ్చింది. యజ్ఞ భావనుడు దక్షిణ ను తన భార్య గా చేసుకొనెను.దక్షిణ పన్నెండు సంవత్సరాలు గర్భము ధరించి ఒక పుత్రుని కనెను అతని పేరు "ఫలము" .ఈతడు కర్మలను సక్రమముగా పూర్తి చేసిన వారికీ ఫలములను ఇచ్చును.యజ్ఞుడు,దక్షిణా పత్నితో పుత్రఫలముతో కర్మిష్టు లకు ఫలము ఒసగుచుండును.అప్పుడు దేవతలు అందరూ సంతోషించి తమ తమ నివాసములకు వెళ్లారు.
కర్త అగు వాడు తన కార్యము పూర్తి అయిన వెంటనే బ్రాహ్మణులకు దక్షిణ ఈయవలెను.అప్పటికప్పుడే కర్త కు ఫలము సిద్దిస్తుంది.దక్షిణ ఈయనిచో చేసిన పుణ్యము అంతయు బూడిద లో పోసిన పన్నీరు అగును..
 

Sep 24, 2011

ద్వారకా తిరుమల


ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. అయితే ఆ మునికి ప్రత్యక్షమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు దక్షిణాభిముఖుడై ఉన్నాడట. అందుకనే.. ఈ ఆలయంలో మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. అలాగే ఒకే విమాన శిఖరం క్రింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి మరో విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైనదిగా, రెండవది స్వామివారి పై భాగం మాత్రమే కనిపించేటట్లుగా ఉండే అర్థవిగ్రహంగా ఉంటుంది.

స్థల పురాణం ప్రకారం చూస్తే... ద్వారకా తిరుమల క్షేత్రం శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదిగా భావిస్తున్నారు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాద సేవను కోరారట. దాంతో స్వామివారి పాదములను మాత్రమే పూజించే భాగ్యం అతడికి దక్కింది. అందుకే మనకు నేడు స్వామివారి పై భాగం మాత్రమే దర్శనమిస్తుంది.

అయితే.. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారనీ... అప్పుడు భక్తులందరి విన్నపాలను స్వీకరించిన ఆయన స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధృవమూర్తికి వెనుకవైపు పీఠంపై.. వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్టించారని చెబుతుంటారు.
అందుకే.. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే శ్రీ వేంకటేశ్వర ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ.. ఆ తరువాత ప్రతిష్టింపబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామపురుషార్ధములు సమకూరుతాయనీ భక్తులు నమ్ముతుంటారు.
ద్వారకా తిరుమలలోని స్వామి వారికి అభిషేకం చేయకపోవటం మరో విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే.. స్వామివారిపై ఒక చిన్న నీటి బొట్టుపడినా.. అది స్వామివారి విగ్రహం క్రిందనుండే ఎర్రచీమలను కదుల్చుతుందని అభిషేకం చేయరు. గుడి సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ, ఆశ్వయుజ మాసాలలో రెండు కళ్యాణోత్సవాలు జరుపుతుంటారు. ఎందుకంటే.. స్వామివారు స్వయంభువుగా వైశాఖ మాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసంలో ప్రతిష్టించిన కారణంగా అలా చేస్తుంటారు.
ద్వారకా తిరుమలకు చేరుకోవడం ఎలాగంటే...? విజయవాడ-రాజమండ్రి మార్గంలో ఏలూరుకు 41 కి.మీ., భీమడోలుకు 17 కి.మీ., తాడేపల్లి గూడెంకు 47 కి.మీ. దూరంలో ఉంది. ఏలూరు, తాడేపల్లి గూడెంలలో ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగుతాయి. భీమడోలులో పాసెంజర్ రైళ్ళు ఆగుతాయి. ఈ పట్టణాలనుండి, మరియు చుట్టుప్రక్కల ఇతర పట్టణాలనుండి ప్రతిరోజూ ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను నడుపుతోంది.

ఇక వసతి విషయానికి వస్తే... పద్మావతి అతిధి గృహం, అండాళ్ అతిధి గృహం, రాణి చిన్నమయ్యరావు సత్రం, సీతా నిలయం, టీటీడీ అతిధి గృహంలాంటివి ద్వారకా తిరుమల దేవస్థానం వారిచే విర్వహింపబడుతున్నాయి. ఇంకా కొన్ని ప్రైవేటు వసతి గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏడుకొండలూ ఎక్కి స్వామివారిని దర్శించుకుని, మొక్కులను తీర్చుకోలేని భక్తులకు ద్వారకా తిరుమల దర్శనం సంతృప్తిని.. తిరుమల వెళ్ళిన అనుభూతిని, ఫలితాన్ని కలుగజేస్తూ భక్తుల నీరాజనాలను అందుకుంటోంది.  

Jul 16, 2011

గణేశ ఆరాధన

                                                           శ్రీ  గణేషాష్టకం
 
ఫలశ్రుతి  :
 ఈ స్త్రోత్రమును మూడు రోజులు ప్రతిరోజు ముడుసంధ్యల చదివిన సర్వ కార్యములు నెరవేరును.
రోజునకు ఎనిమిది పర్యాయములు చొప్పున ఎనిమిది రోజులు,
చవితి నాడు ఎనిమిది పర్యాయములు చదివిన అష్టసిద్ధులు పొందుదురు.
ప్రతి నిత్యమూ పదిసార్లు చొప్పున ఒక నెల రోజులు చదివిన సమస్త బంధములు తొలగును.
విద్యలనభిలాషించు వారు విద్యాప్రాప్తి,సంతానము కావలయునని కోరు వారికి సంతాన ప్రాప్తి యు కలుగును.
ఇరువది యొక్క మారులు చదివిన సమస్త కోరికలు నెరవేరును.


********************************************************************************

                                                               గణేశ మూలమంత్రం
                                          ఓం గం గణపతయే నమః

 దీనిని జపించుటవలన విఘ్న  భయం తొలగి కార్య సిద్ధి కలుగుతుంది.
దీనిని మనసా వాచా నిత్యం ప్రాతః సమయం లో ఇరువది ఒక్క మారు జపిస్తే పనులు నెరవేరి ఆనందం పొందగలరు .
 

Jul 14, 2011

సూర్య చరిత్ర



బ్రహ్మ మానస పుత్రుడు కశ్యప ప్రజాపతి,
దక్షుని కూతురు అదితి కు కలిగిన సంతానం వివస్వంతుడు అతడే సూర్యుడు.
త్వష్ట  అనే అతని కుమార్తె సంజ్ఞా కు సూర్యుని కు కలిగిన సంతానం వైవస్వతుడు(మనువు),శ్రాద్ధ దేవుడు,యముడు-యమునా అనే కవలలు పుట్టిరి.
సంజ్ఞా యొక్క మరొక రూపమే ఛాయ,,ఛాయ కు సూర్యునకు కలిగిన సంతానం సావర్ణుడు,శని

సూర్యుని సంతానం అయిన వైవస్వతుడు మనువు అయ్యెను,ఇప్పుడు నడుస్తున్న ది వైవస్వత మన్వంతరం రాబోవునది సావర్ణ మన్వంతరం.
యముడు దక్షిణ దిక్పాలకుడు అయ్యెను.శని ఒక గ్రహము అయ్యెను.
యమునా భూలోకమున నది అయ్యెను.
శ్రాద్ధ దేవుడు పితృలోకానికి అధిపతి అయ్యెను.
 సూర్యుని నామములు
1.ఆదిత్యుడు 2.సవిత 3.సూర్యుడు 4.మిహిరుడు 5.అర్కుడు 
6..ప్రభాకరుడు 7.మార్తాండుడు 8.భాస్కరుడు 9.భానుడు
10.చిత్రభానుడు 11.దివాకరుడు 12.భాను  





Jul 11, 2011

గణపతి రూపాలు

పదహారు గణపతి రూపాలు  ఆ గణపతి  రూపాన్ని  ఆయా తిధిలలొ పూజిస్తే  మంచి ఫలితాలు ఉంటాయి ,,
          అమావాస్యశ్రీ  నిరుత్థ  గణపతి
1.       పాడ్యమి   శ్రీ బాల  గణపతి

2.       ద్వితీయ   శ్రీ  తరున  గణపతి

3.       త్రితియ    శ్రీ భక్థి గణపతి
4.       చవితి      శ్రీ వీర గణపతి

5.       పంచమి   శ్రీ శక్థి గణపతి
6.       షస్ఠి         శ్రీ ధ్విజ  గణపతి

7.       సప్తమి     శ్రీ సిద్ధి  గణపతి

8.       అష్టమి      శ్రీ ఊచ్చిష్ట  గణపతి

9.       నవమి      శ్రీ విఘ్న  గణపతి
10.     దశమి       శ్రీ క్షిప్ర  గణపతి
11.     ఏకదశి      శ్రీ హేరంభ  గణపతి

12.     ద్వాదసి     శ్రీ లక్ష్మి గణపతి
13.     త్రయొదశి  శ్రీ మహా  గణపతి
14.     చతుర్దశి     శ్రీ విజయ గణపతి
15.       పౌర్నమి     శ్రీ  నిరుత్థ  గణపతి




గరుత్మంతుడు

గరుత్మంతుడు స్వామి వారి వాహనము అగు కధ